మూడేళ్ల వైసీపీ పరిపాలనలో రాయలసీమ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందన్నారు. రాయలసీమలో పర్యటించకపోయిన ఫర్లేదు…. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ప్రజా తీర్పు…వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యం,క్రీడల పై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై శుక్రవారం దేశం భగ్గుమంది. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలో సైన్య నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో యువత ఆందోళనలు చేపట్టింది. ఇవి కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.…