కేటీఆర్ తప్పులు చేస్తే.. మంత్రి పదవి ఇచినావు ! విద్యార్దులు తప్పు చేస్తే..మన్నించలేవా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ.. అగ్ని పథ్ తెచ్చి దేశ భద్రతను చీకట్లో కి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకే తొమ్మిది నెలలు శిక్షణ తీసుకుంటారు అలాంటిది సైనికుల కు అరు నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్రశ్నించారు. కోటి జనాభా లేని ఇజ్రాయిల్ తో మన దేశంని పోల్చడం ఏంటని మండిపడ్డారు రేవంత్. అది బీజేపీ…
బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్‌కు నిరసనగా రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్‌తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్‌లను సెక్యూరిటీ…
కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ, హర్యానా ప్రాంతాల్లో హింస చెలరేగింది. కేవలం నాలుగేళ్లకే సర్వీసును పరిమితం చేయడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకే వయోపరిమితి విధించడంతో వయస్సు దాటిపోయిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా నిన్న వయోపరిమితని మరో రెండేళ్లు పెంచగా.. తాజాగా శనివారం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. నిరుద్యోగుల ఆందోళనతో దిగి వచ్చిన…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. అయితే ఈ ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది అని మండిపడ్డారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని…
అగ్నిపథ్ స్కీంకు సంబంధించిన అంశంపై ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు, స్టాళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త ఘటనల కారణంగా కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు…