Nizam College: నిజాం కాలేజ్ గర్ల్ హాస్టల్ లో యూజీ విద్యార్థినిలకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లో చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం హీటెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాడిపత్రిలో నగర సుందరీకరణ పనులు చేస్తుంటే వైసీపీ వాళ్లు పార్టీ జెండాలు కట్టారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్టేషన్ ముందు రోడ్డుపై పడుకొని జేసీ నిరసన వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Womens agitation: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల లో 50 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో మహిళల గుడిసె పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో మహిళలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.
తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ షాకిచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు… నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.…