ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 ఏళ్ళ కల అది. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావాలని కోరుకున్నారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆదివాసీలు తమ కల సాకారం అయినందుకు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. 30 నివాస సముదాయాలున్న ఆదివాసీ గ్రామం మంగీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు శబ్దం వినిపిస్తోంది. రయ్యి రయ్యి మంటూ దూసుకువస్తున్న ప్రజారవాణా వ్యవస్థను అక్కడి మహిళలు, పిల్లలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మంగీ గ్రామ పంచాయతీకి…