(సెప్టెంబర్ 7న ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు పూర్తి) దేశం గర్వించదగ్గ దర్శకనిర్మాత బి.ఆర్.చోప్రా. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అఫ్సానా’. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘అఫ్సానా’ 1951 సెప్టెంబర్ 7న విడుదలయింది. ఈ చిత్రానికి ఐ.ఎస్.జోహార్ కథ, మాటలు సమకూర్చారు. షదీలాల్ హండాతో కలసి బి.ఆర్.చోప్రా ఈ సినిమాను నిర్మించారు. త్రిభువన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ‘అఫ్సానా’ సినిమా కథ చదువుతున్నట్టుగానే చిత్రీకరించారు. టైటిల్ కార్డ్స్ సమయంలోనే ఓ…