Bill Gates Financial Support to Africa: ఆఫ్రికా పురోభివృద్ధికి తన వంతు సాయం చేసేందుకు అమెరికన్ బిలియనీర్, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ ముందుకొచ్చారు. తన సంపదలో కొంత భాగాన్ని ఇందుకు కేటాయించనున్నట్లు మాటిచ్చారు. ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలకు నాలుగేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఖర్చుపెడతానని అన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల నైరోబీలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు.