ఆఫ్ఘనిస్థాన్‌లో సంక్షోభంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, రక్షణ విమానాల కార్యకలాపాలు కొనసాగుతాయని నాటో అధికారులు ప్రకటించారు. మరోవైపు… ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జన్సన్ స్పందించారు. అక్కడి సంక్షోభంపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. తాలిబాన్ల…
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దాడులకు సంబంధించిన అంశంలో భారత ప్రభుత్వం స్పందించాలి. టెర్రరిస్టులు మన దేశం వైపు కూడా చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది అని సీపీఐ నారాయణ అన్నారు. ముందే మనం కూడా మేల్కొంటే.. అందరికీ మంచిది. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గం. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనీ అమ్మేస్తున్నారు. కోవిడ్ సమయంలోనే అదానీ, అంబానీలు వందల కోట్లు సంపాదించుకున్నారు. ప్రధాని చెప్పేవన్నీ మాటలకే పరిమితం.. చేతల్లో మాత్రం…