Afghanistan: భారతదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. న్యూఢిల్లీలో ఆఫ్గాన్ ఎంబసీ మూసివేసింది. గత కొన్ని నెలలుగా భారత్ లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముగ్గురు రాయబార కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అరాచకాలను చూడాల్సి వచ్చింది.. అంతే కాదు.. ఆకలితో అలమటించిపోతున్నారు అక్కడి ప్రజలు.. భారత్ లాంటి దేశాలు ఆదుకోవాడికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక, ప్రభుత్వాన్ని నడపడానికి తాలిబన్లు ఆపసోపాలు పడుతున్నారు.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది తాలిబన్ల పరిస్థితి.. ఎందుకంటే.. తన వద్దనున్న 8 లక్షల డాలర్లను పొరపాటున తన శత్రుదేశమైన తజికిస్తాన్‌కి పంపించారు తాలిబన్లు.. అంటే, ఇది భారత్ కరెన్సీలో రూ.6 కోట్లు అన్నమాట..…