ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల విభజన జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రరాష్ట్రంగా రూపు మారుతోందని, కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ, గిరి బిడ్డలు, వాగ్గేయ కారులు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు పెట్టామన్నారు. గతంలో ఉన్న 13 జిల్లాల కేంద్రాలను అలాగే కాపాడాం. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా, 1979 జూన్ లో…