దాదాపు 550 కోట్ల బడ్జెట్‌లో లైవ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో.. ఆదిపురుష్ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు ఫ్లాప్‌లు అందుకున్నప్పటికీ.. ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ప్రభాస్‌ని రాముడిగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. ఖచ్చితంగా డే వన్ 150 కోట్లకు పైగా రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో…