Adipurush: ఓవర్సీస్ లో డాలర్ల వర్షం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 550 కోట్ల బడ్జెట్‌లో లైవ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో.. ఆదిపురుష్ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు ఫ్లాప్‌లు అందుకున్నప్పటికీ.. ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ప్రభాస్‌ని రాముడిగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. ఖచ్చితంగా డే వన్ 150 కోట్లకు పైగా రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్‌ను రాయబోతోంది ఆదిపురుష్. ఇండియా వైడ్‌గా ఆదిపురుష్ హవా ఓ రేంజ్‌లో ఉంది. ఇక ఓవర్సీస్‌లోను ఆదిపురుష్ దుమ్ముదులుపుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 1 మిలియన్ మార్క్ టచ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అమెరికాలో భారీగా బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు 800K డాలర్స్ మార్క్ క్రాస్ చేసిందని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో తొలి రోజు ప్రివ్యూస్‌తో వన్ మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన చిత్రాలు తక్కువ. ఈ లిస్టులో ఆదిపురుష్ చేరిందా? లేదా? అనేది తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సి ఉంది. కానీ ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 1 మిలియన్ మార్క్‌ని టచ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన బాహుబలి 1, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ సినిమాలు 1 మిలియన్ డాలర్స్ క్లబ్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆదిపురుష్ కూడా ఆ లిస్ట్‌లోకి చేరిపోనుందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఇకపై ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ మార్క్ రీచ్ అయ్యేలా ఉంది.
Also Read
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
తాజావార్తలు
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..