నిన్న మొన్నటి వరకు బలం మనదే అనే ధీమా వారిలో కనిపించింది. సీన్ కట్ చేస్తే వెన్నులో ఎక్కడో వణుకు మొదలైంది. ఆదివాసీలు ఒకే స్వరం అందుకోవడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలవడం.. అధికారపార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోందట. ఎమ్మెల్సీ ఎన్నికలు.. జిల్లాలో రాజకీయ సెగలు..! అధికారపార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అనుకుంటున్న సమయంలో…