కోవిడ్ అనంతరం కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నెల 11వ తేది నుంచి 17వ తేది వరకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. 7 రోజులలో 5.30 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 24.38 లక్షల లడ్డూలు విక్రయిస్తే….హుండీ ద్వారా రూ.32.5 కోట్లు ఆదాయం లభించిందన్నారు. 46 వేల 419 వాహనాలలో భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. మే 1వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను…