Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా గ్రూప్ కంపెనీ చీఫ్ ఆనంద్ మహీంద్రా. సమకాలిన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. నెటిజన్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా అదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై స్పందించారు. భారతదేశంపై ఎప్పుడు పందెం కాయొద్దు అని పాశ్చాత్య మీడియాకు వార్నింగ్ ఇచ్చారు.