Today (30-01-23) Stock Market Roundup: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వాటాల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఫలితంగా ఈ వారం ప్రారంభం రోజైన ఇవాళ సోమవారం రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. బెంచ్ మార్క్‌ను దాటి పైకి రాలేకపోయాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే లాభాల్లోకి వచ్చాయి.
Today (19-01-23) Business Headlines: హైదరాబాద్ స్టార్టప్.. అరుదైన గుర్తింపు: హైదరాబాదులోని ఫిన్-టెక్ స్టార్టప్ సంస్థ MicroNsure Consultancyకి నేషనల్ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను బీమా విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్ అండ్ CEO కమలాకర్ సాయి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MicroNsure Consultancy ఏర్పాటు లక్ష్యాలను వివరించారు.