అదానీ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్‌భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. మేము రేవంత్ రెడ్డి, అదానీ ఫోటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారన్నారు.