Amazon Prime: ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది.