కరోనా తగ్గుముఖం పడుతుందన్న సమయంలో.. చిన్నారులను పోస్ట్ కొవిడ్ లక్షణాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్లలు అక్యూట్ హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ వ్యాధితో పదిమంది పిల్లలు ప్రాణాలుకూడా కోల్పోయారు. ఈ అక్యూట్ హెపటైటిస్‌కు సంబంధించిన మొదటికేసు యూకేలో మొదటిసారి బయటపడింది. ఈ ప్రమాదకర కాలేయ వ్యాధికి కారణం అంతుచిక్కడం లేదు. సాధారణంగా హెపటైటిస్‌కు హెపటైటిస్- ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు వైరస్‌లు కారణమవుతాయి.…