తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘షో’తో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా జాతీయ అవార్డును అందుకున్నారు దర్శకులు నీలకంఠ. అంతేకాదు… ‘షో’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానూ ఎంపికైంది. ఆ తర్వాత నీలకంఠ తెరకెక్కించిన ‘మిస్సమ్మ’, ‘విరోధి’ చిత్రాలు నంది అవార్డులను కైవసం చేసుకున్నాయి. థ్రిల్లర్ జానర్స్ ను తెరకెక్కించడంలో మంచి పేరున్న నీలకంఠ మరోసారి అదే జానర్ లో మూవీ చేస్తున్నారు. యంగ్ హీరో సాయి రోనక్, అందాల భామ రిచా పనయ్ జంటగా…