(ఆగస్టు 30న జమున పుట్టినరోజు) నటి జమున పేరు వినగానే ఆ నాటి ఆమె అందాలరూపాన్నే ఊహించుకొనే అభిమానులు ఎందరో ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఎక్కువ కాలం నాయికగా నటించిన ఘనతను జమున సొంతం చేసుకున్నారు. తనకంటే వయసులో చిన్నవారి సరసన సైతం హీరోయిన్ గా నటించి మెప్పించారామె. ఇక నాటి మేటి నటులతో జమున తనదైన బాణీ పలికిస్తూ నటించిన తీరును అభిమానులు ఇప్పటికీ మననం చేసుకొని ఆనందిస్తూ ఉంటారు. సత్యభామగా తెరపై ఆమె అభినయించిన…