(నేడు నటి దివ్యవాణి పుట్టిన రోజు) అచ్చ తెలుగు కథానాయికలకు టాలీవుడ్ లో అవకాశాలు దక్కవనే అపప్రధను తోసిరాజని నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్యవాణి. గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టి ఆ పైన చెన్నయ్ చేరి సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంది. ‘సర్దార్ కృష్ణమ నాయుడు’లో హీరో కృష్ణ కుమార్తెగా నటించిన దివ్యవాణి… ఆ తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించింది. ఆపైన కొద్ది కాలానికే హీరోయిన్ గా ఎదిగింది. ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి…