(మార్చి 19న శ్రీనివాస్ అవసరాల పుట్టినరోజు)తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ చిత్రసీమలో సాగిపోతున్నారు నటదర్శక రచయిత శ్రీనివాస్ అవసరాల. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అవసరాల మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేస్తున్నాడు. చదువుకొనే రోజుల్లోనూ, ఆ తరువాత ప్రిన్స్ టన్ ప్లాస్మా ఫిజిక్స్ లాబోరేటరీలో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ మనసు మాత్రం సినిమాపైనే ఉండేది. దాంతో అమెరికాలో పనిచేస్తున్న సమయంలోనే లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్నాడు. ‘బ్లైండ్…