ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో మరో నిందితుడ్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన విషయాలు చెప్పారు. అతడు చేపట్టిన పెద్ద ఒప్పుకోలు ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. తన టాప్ టెన్ టార్గెట్ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నంబర్ వన్ అని లారెన్స్ ఒప్పుకున్నాడు.