(జూన్ 25న సాయిచంద్ పుట్టినరోజు) నటుడు సాయిచంద్ ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరో కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆరంభంలో ‘మాభూమి’ వంటి సంచలనాత్మక చిత్రంలో ప్రధాన భూమిక పోషించి మెప్పించారు. ఆ తరువాత ‘మంచు పల్లకి’లో చిరంజీవి స్నేహితునిగా, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ దేశంలో ఒక రోజు’ వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలూ పోషించారు. బాపు ‘పెళ్ళీడు పిల్లలు’లో ఓ హీరోగా నటించారు. ‘ఈ చదువులు మాకొద్దు’లోనూ కీలక…