తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదం పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు లేబర్ కమిషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ గంగాధర్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తమ వాదనలను వివరించారు. అనంతరం వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “కార్మికుల వేతనాల అంశంపై మేము అదనపు కమిషనర్ గంగాధర్‌ను కలిసాము. లేబర్ కమిషన్ ఒక పర్సెంటేజ్…
తెలుగు సినీ పరిశ్రమలో 30% వేతనాల పెంపు కోసం తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఈ వివాదం పరిష్కారం కోసం లేబర్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ ఎన్టీవీతో కీలక ప్రకటనలు చేశారు. సినీ కార్మికుల ఫెడరేషన్ ఈ విషయంపై తమను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. 2022లో చివరిసారిగా వేతనాలు సవరించిన తర్వాత, మూడేళ్ల వ్యవధిలో 30% వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం సినీ…
సినీ పరిశ్రమలో ఫిల్మ్ ఫెడరేషన్ తరపున యూనియన్ సభ్యులందరూ కలిసి 30% వేతనాల పెంపు కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2022లో చివరిగా వేతనాలు పెంచారు. ఆ తర్వాత మూడేళ్ల తరువాత ఈ వేతనాల పెంపు ఉండేలా ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ నష్టాలలో నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు మాత్రం ఆ పెంపుకు సుముఖంగా లేరు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కేవలం పెంచిన వారి షూటింగ్స్‌కి…
Tollywood: తెలుగు చిత్రపరిశ్రమలో `యాక్టివ్ తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్` డిసెంబర్ 1 నుండి షూటింగ్స్ జరపరాదన్న నిర్ణయానికి వచ్చింది. ప్యాండమిక్ కారణంగా తెలుగు సినిమా రంగమే కాదు, భారత చిత్రసీమ, యావత్ ప్రపంచంలోని సినిమా పరిశ్రమ నష్టాల బాట పట్టింది. దీనిని అధిగమించడానికి ఆ యా దేశాల్లోని సినిమా జనం కృషి చేస్తూనే ఉన్నారు.
టాలీవుడ్ లో ఈ సంక్రాంతి వార్ గట్టిగానే ఉండబోతోంది. తెలుగు చిత్రసీమలో ఉన్న పెద్ద హీరోలంతా పొంగల్ బరిలోకి దిగేశారు. ఈసారి జనవరిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు ఉన్నాయి. మహేష్ బాబు చిత్రం “సర్కారు వారి పాట”ను కూడా ముందుగా సంక్రాంతికే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ తరువాత నిర్ణయం మార్చుకున్న మేకర్స్ సినిమా విడుదల తేదీని మార్చేశారు. ఇప్పుడు మిగిలిన మూడు సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగనుంది. మూడు…
ఆగస్ట్ 20వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ లో కొందరు చేసిన ఆరోపణలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. కొవిడ్ కారణంగా సినిమా రంగంలోని అన్ని విభాగాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమయంలో అంతా కలిసి మెలిసి ముందుకు సాగాల్సింది పోయి… ఓ వ్యక్తిని, ఓ నిర్మాతను టార్గెట్ చేస్తూ విమర్శించడం సరికాదని తెలిపింది. ఇలా వ్యక్తులను, నిర్మాతలను ఏ ఒక్క శాఖ విమర్శించినా ఊపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.…