CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలతో విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం కళాశాల గేట్లకు తాళం వేసి లోపలికి ఎవరినీ అనుమతించడం…