తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ బదిలీలు జరుగుతున్నాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలోని పలు కీలక శాఖలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 61 మంది ఏసీపీ అధికారులను బదిలీ చేస్తున్నట్లు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే శనివారం 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేశారు. ఎన్నికల సంఘం…