Vallabhaneni Vamsi: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు 8 గంటల పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. విజయవాడలోని నాల్గవ అదనపు న్యాయమూర్తి ముందు వంశీని పోలీసులు ప్రవేశ పెట్టారు.