జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పబ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఘటన జరిగి 15 రోజులు కావొస్తున్నా.. నిత్యం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార కేసులోని ఆరుగురు నిందితులను పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులోని A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడి నేటీతో ముగియనుంది. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే…