Tragedy : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆదివారం దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పరిస్థితి ఒక విషాద ఛాయను సంతరించుకుంది. నిర్లక్ష్యపు నిమిషాలు అమూల్యమైన ప్రాణాన్ని బలిగొన్నాయి. కేవలం 21 నెలల బాలుడు కార్పెంటైన్ ఆయిల్‌ను మంచినీళ్లుగా పొరపడి తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన గ్రామస్థులను విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన ధన్వాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోడ మమత, ఆమె భర్త నరేష్ కుటుంబంలో చోటు చేసుకుంది.…