Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ "దొంగ" అయిన పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీని బీసీసీఐ వదిలిపెట్టే స్థితి కనిపించడం లేదు. ఇంతలో మరో ప్రధాన వార్త వెలువడింది. ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేశారు. అయితే.. ఈ ట్రోఫీని టీం ఇండియాకు ఎప్పుడు అందజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
2025 ఆసియా కప్ గెలిచిన భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నఖ్వీ తన హోటల్ గదికి ట్రోఫీని తీసుకెళ్లాడు. నఖ్వీ ప్రవర్తనపై విస్తృత విమర్శలు వచ్చాయి. తాజాగా మొహ్సిన్ నఖ్వీ భారతదేశానికి ట్రోఫీని అందించడానికి తన సుముఖతను వ్యక్తం చేశాడు. ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ భారత జట్టుకు ట్రోఫీని అందించడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఆయన ఒక షరతు…