అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ ‘ఏపీబీ 144000’ యాప్‌ను లాంచ్ చేయడం మీద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కౌంటర్లు వేశారు. మొత్తం వ్యవస్థల్నే దోచేసిన వ్యక్తి.. లంచాలు తీసుకోవడం నేరమని జగన్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ ఛలోక్తులు పేల్చారు. జగన్ సామాజిక న్యాయం కేవలం మాటలకే పరిమితమైందే తప్పే, ఆచరణలో శూన్యమన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ దోచుకున్నారని, ఇప్పుడు తాను అధికారంలో…