పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కోట్లాది రూపాయల స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు అధికారిని వెంటనే మార్చాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
(INDIA) కూటమి అధికారంలోకి వస్తే ఎల్‌పిజి సిలిండర్‌లను రూ. 500 తక్కువ ధరకు అందజేస్తామని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్‌లోని పలువురు మంత్రులను టార్గెట్ చేసిన వేళ అమిత్ షాను 'ఇండియాలోనే అతిపెద్ద పప్పు' అని కామెంట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 'బొగ్గు అక్రమాస్తుల కుంభకోణం'పై విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.