సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది సాధారణం అయిపోయింది. అభిమానులు ప్రేమను వ్యక్తం చేసే విధంగా కామెంట్లు చేస్తే, కొందరు మాత్రం విమర్శలతో, వ్యంగ్యాలతో ముందుకు వస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అలాంటి ట్రోలింగ్‌కు గురయ్యారు. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రంలో చూపించిన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. అయితే, ఈ అవార్డు నిజంగా ఆయనకు రావాలా లేదా అనే చర్చ నెటిజన్లలో మొదలైంది.…