ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన సినిమా ‘ఆకాశవాణి’. శుక్రవారం నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ‘వివాహ భోజనంబు’, ‘ప్రియురాలు’ తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రమిది. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్న అశ్విన్ కు దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ. ఒకానొక సమయంలో, ఒకానొక చోట జరిగే కథ ఇది. నాగరిక ప్రపంచానికి…