(మోహనగాంధీ బర్త్ డే సందర్భంగా) ఏ తరహా కథ తన దగ్గరకు వచ్చినా దాన్ని ఆకళింపు చేసుకుని, విజయవంతమైన సినిమాగా మలచడానికి నూరు శాతం కృషి చేసే అరుదైన దర్శకులలో ఎ. మోహనగాంధీ ఒకరు. తెలుగు చిత్రసీమలో కమిట్ మెంట్ అనే పదానికి పర్యాయపదం ఆయన. అందుకే అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన్ని తమ మనిషిగా భావించాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చాయి. నిజం చెప్పాలంటే మోహనగాంధీకి లభించిన విజయాలు మరో దర్శకుడికి…