తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో లేదో… తమ రాక్షసత్వం ఎలా ఉంటుందో ఆఫ్ఘన్ ప్రజలకు చూపుతున్నారు… తాలిబాన్లు. ముఖ్యంగా పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత… రక్తం ఏరులై పారుతోందా? అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. పంజ్‌షీర్‌లో ఇంటింటి తనిఖీలు చేపట్టి… తమ వ్యతిరేకం అనిపించిన వారిని, మైనార్టీలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను కూడా తాలిబన్లు హతమార్చారు. ఇక, ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే, ఇవాళ జరగాల్సిన…