సౌదీ అరేబియాలో సాధారణంగా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పు చేశారని నిరూపణ అయితే గుండు చేయడం, కాళ్లు, చేతులు తీసేయడం వంటివి ఆ దేశంలో చేస్తుంటారు. ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వం నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది.…