రాజధాని అమరావతిలో రైతులు ఉద్యమం ప్రారంభించి నేటితో సరిగ్గా 800 రోజులు అవుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి కోసం తాము ప్రాణ సమానమైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టడం.. పైగా మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడంతో అమరావతి రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. తమకు జరిగిన అన్యాయంపై నిరంతర పోరాటం సాగిస్తున్నారు. తమ…