యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన…