చండీగఢ్ మేయర్ ఎన్నికపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమారే మేయర్‌గా ప్రకటించింది.
చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం షాకిచ్చింది. మేయర్ ఎన్నిక (Chandigarh Mayoral Polls) సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.