కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు టమోటాల వినియోగం ఎక్కువగా వుంటుంది.…