లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమైన అంశాలను కవర్ చేసే సుమారు 7 సమావేశాలను నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, రెమల్ తుఫాను అనంతర పరిస్థితిని సమీక్షించే సమావేశంతో ప్రారంభం కానుంది.