ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ ఘనస్వాగతం లభించింది. రెండు దేశాల పర్యటన కోసం గురువారం బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో దిగగానే మోడీకి ఘనస్వాగతం లభించింది. థాయ్‌లాండ్ అధికారులతో పాటు భారతీయులు భారీ స్వాగతం పలికారు.