టామ్ లాథమ్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పుణెలో శనివారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.