(జూన్ 30తో ‘బాటసారి’కి 60 ఏళ్ళు)బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ నెలకొల్పిన ‘భరణీ’ సంస్థతో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు విడదీయరాని బంధం ఉంది. అందరూ ‘దేవదాసు’తో ఏయన్నార్ తొలిసారి భగ్నప్రేమికునిగా నటించారు అని అంటూ ఉంటారు. కానీ, భరణీవారి ‘లైలా-మజ్ను’లోనే అక్కినేని తొలిసారి విఫల ప్రేమికునిగా కనిపించారు. “రత్నమాల, లైలా-మజ్ను, ప్రేమ, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి, గృహలక్ష్మి” వంటి భరణీ సంస్థ నిర్మించిన చిత్రాలలో ఏయన్నార్ నటించారు. ఈ సినిమాలన్నీ అక్కినేనికి నటునిగా…