వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ ప్రకటించిన షెడ్యూల్‌లో మొదటి టెస్ట్ 6 రోజుల్లో ఆడనున్నట్లు ఉంది. సాధారణంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరుగుతుంది. కానీ.. ఈ టెస్ట్ మ్యాచ్ ఆరు రోజులు జరగనుంది. అందుకు కారణమేంటంటే.. గాలెలో జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ సమయంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.