బంగ్లాదేశ్‌తో జరిగిన చెన్నై టెస్టులో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో 5వ సెంచరీ సాధించాడు. 119 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్ల మార్కును కూడా దాటేశాడు.