(సెప్టెంబర్ 3న జమున ‘బంగారుతల్లి’కి 50 ఏళ్ళు) కళారంజని జమున అభినయ పర్వంలో మరపురాని చిత్రాలు అనేకం. వాటిలో ‘బంగారుతల్లి’ మరింత ప్రత్యేకం. హిందీలో నర్గీస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మదర్ ఇండియా’ ఆధారంగా ‘బంగారు తల్లి’ తెరకెక్కింది. ‘మదర్ ఇండియా’ టైటిలే జనాన్ని విశేషంగా అలరించింది. ఇక ఆ సినిమా పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది. ఆ చిత్ర దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ 1940లోనే ‘ఔరత్’ అనే సినిమా తెరకెక్కించారు. అందులో భర్త చనిపోయి, ఇద్దరు…