ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 దుకాణాలు ఉన్న రెండు భవనాలు మంటల్లో కాలిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం బూడిదే కనిపిస్తుంది. 12 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో ధ్వంసమైన దుకాణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని.. వ్యాపారుల నష్టం కోట్లలో ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.